వీకెండ్ లోపే ఆ మార్క్ ని అందుకోనున్న అర్జున్ రెడ్డి


అందరూ ఊహించిన విధంగానే అర్జున్ రెడ్డి చిత్రం హిట్ టాక్ తో దూసుకుని పోతోంది. ఈ చిత్రంలో నెలకొన్న వివాదాలు కూడా పబ్లిసిటీకి బాగా ఉపయోగపడ్డాయి. అన్ని ఏరియాలలో ఈ చిత్రానికి యువత నుంచి మంచి స్పందన లభిస్తోంది. ముఖ్యంగా యూఎస్ లో ఈ చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.

కేవలం యూఎస్ ప్రీమియర్ లతోనే ఈచిత్రానికి 194000 డాలర్ల వసూళ్లు లభించాయి. శుక్రవారం ఉదయానికి ఈ చిత్రం మరో 240000 డాలర్ల కలెక్షన్లు సాధించింది. ఈ వీకెండ్ కి హాఫ్ మిలియన్ డాలర్ క్లబ్ లోకి చేరడం ఖాయంగా కనిపిస్తోంది. విజయ్ దేవరకొండ, షాలిని లు జంటగా నటించిన ఈ చిత్రాన్ని సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించారు.