అర్జున ఫల్గుణ రిలీజ్ డేట్ ఫిక్స్

Published on Dec 16, 2021 12:30 pm IST

శ్రీ విష్ణు హీరోగా, అమృత అయ్యర్ హీరోయిన్ గా తేజ మర్నీ దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం అర్జున ఫల్గుణ. మాట్నీ ఎంటర్ టైన్మెంట్ పతాకం పై నిరంజన్ రెడ్డి మరియు అన్వేష్ రెడ్డి లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రియదర్శన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ చిత్రం విడుదల కి సంబందించిన ఒక అధికారిక ప్రకటనను చిత్ర యూనిట్ వెల్లడించడం జరిగింది.

ఈ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్ 31 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ల లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా విడుదలైన పోస్టర్ సైతం ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియా వేదిక ఈ విషయాన్ని చిత్ర యూనిట్ వెల్లడించడం జరిగింది. అర్జునుడు సమరానికి సిద్దం అవుతుండటం తో ప్రేక్షకులు, అభిమానులు ఈ చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :