ప్రతిష్టాత్మక చిత్రానికి ఆడియో డేట్ ఫిక్సైంది !
Published on Nov 23, 2016 1:50 pm IST

Gautamiputra-Satakarni

నందమూరి బాలకృష్ణ తన సినీ జీవితంలో ఒక మైలు రాయిని దాటుతూ చేస్తున్న ప్రతిష్టాత్మక 100వ చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’. 100వ సినిమాగా గొప్ప కథను చేయాలని ఎక్కువ కాలం నిరీక్షించిన బాలయ్య చివరికి ఎంతో ఇష్టంగా దర్శకుడు క్రిష్ చెప్పిన ఈ శాతకర్ణి కథను ఒప్పుకుని సినిమా చేస్తున్నారు. క్రిష్ కూడా చాలా జాగ్రత్తగా సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తికాగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇకపోతే ఈ సినిమాకి సంబందించిన ప్రతి ఈవెంట్ ను గ్రాండ్ గా చేయాలని సంకల్పించారు టీమ్.

అందుకే మొదటి మూవీ ఓపెనింగ్ ను అమరావతిలో చేసి ఇప్పుడు ఆడియో వేడుకను తిరుపతిలో గ్రాండ్ గా చేయనున్నారు. మొదట ఈ ఆడియో వేడుకను డిసెంబర్ 9న అనుకోగా ఇప్పుడు డిసెంబర్ 16గా మార్చారు. ఈ వేడుకకు పలువురు సినీ పెదాలతో పాటు ముఖ్యమంత్రి, బాలయ్య వియ్యంకుడు చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు హాజరుకానున్నారు. ఇకపోతే సినిమానై సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు.

 
Like us on Facebook