అద్బుతంగా “అవతార్ 2” టీజర్ ట్రైలర్..!

Published on May 9, 2022 11:41 pm IST


అవ‌తార్ సినిమాతో సినీ అభిమానులను స‌రికొత్త అద్బుత ప్ర‌పంచంలోకి తీసుకెళ్లిన హాలీవుడ్ లెజెండ‌రీ ద‌ర్శ‌కుడు జేమ్స్ కామెరాన్ ఆ సినిమాకు సీక్వెల్‌గా అవతార్-2 సినిమాను కూడా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. 21 సెంచరీ ఫాక్స్ ఐఎన్‌సీ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఎన్నడూ లేని విధంగా ఏకంగా 160 భాషల్లో డిసెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ మూవీ టీజర్ ట్రైలర్‌ను ‘డాక్టర్ స్ట్రేంజ్: ఇన్ ది మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్’ సినిమా ప్రదర్శించే థియేటర్లలో విడుదల చేశారు.

అయితే ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ టీజర్ ట్రైలర్‌ను తాజాగా సోషల్‌ మీడియా వేదికగా రిలీజ్‌ చేసింది చిత్ర బృందం. ఈ ట్రైలర్‌ పండోరా గ్రహానికి సంబంధించిన విజువల్స్‌తో ప్రారంభం కాగా సముద్రంపై అవతార్‌లు అందంగా నిర్మించుకున్న ఇళ్లు, సంద్రం లోపల వారు పక్షులపై ఈదుకుంటూ వెళ్తున్న దృశ్యాలు కనువిందు చేసేలా ఉన్నాయి. మొత్తానికి ఈ ట్రైలర్‌ ఆసక్తిగా, అద్భుతంగా అనిపించింది.

సంబంధిత సమాచారం :