సాలిడ్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘అ !’ !
Published on Feb 17, 2018 10:13 am IST

సాధారణంగానే హీరో నాని సినిమాలంటే ఓవర్సీస్లో మంచి క్రేజ్ ఉంటుంది. ఈ మధ్య ఆయన సినిమాలు మిలియన్ డాలర్ క్లబ్ ను ఈజీగా దాటేస్తున్నాయి. ఆ క్రేజే ఇప్పుడు ఆయన నిర్మించిన తొలి చిత్రం ‘అ !’కు మంచి ఓపెనింగ్స్ వచ్చేలా చేసింది. ముందు నుండి ఉన్న ప్రీ రిలీజ్ బజ్ మూలాన ప్రీమియర్స్ తో పాటు తొలిరోజు సినిమాకు మంచి ఓపెనింగ్స్ దక్కాయి.

ప్రీమియర్ల ద్వారా 1.26 లక్షల డాలర్లను వసూలుచేసిన ఈ సినిమా ఒకటవ రోజు శుక్రవారం సాయంత్రానికి 2.25 లక్షల డాలర్లను రాబట్టి రెండవ రోజు కూడా మంచి ప్రారంభాన్ని పొందింది. తెలుగు రాష్ట్రాల్లో సైతం చిత్రానికి మంచి ఓపెనింగ్స్ లభించాయి. నూతన దర్శకుడు ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ఇంతవరకు తెలుగులో ఏ దర్శకుడూ ప్రయత్నించని కొత్త జానర్ సినిమా అనే ప్రసంశను దక్కించుకుంది.

 
Like us on Facebook