ఆకట్టుకుంటున్న అ సినిమా ట్రైలర్ !

హీరో నాని సమర్పణలో వాల్‌పోస్టర్‌ సినిమాపతాకంపై నిర్మించబడిన సినిమా ‘అ’. ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు ప్రశాంతి త్రిపురనేని నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఈ సినిమాలో రవితేజ, నాని వాయిస్ ఓవర్లు స్పెషల్ అట్రాక్షన్ కానుంది. ఈరోజు అ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ గ్రాండ్ గా చెయ్యబోతున్నారు.

ఈ సందర్భంగా విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. కాజల్, ఇషా రెబ్బా, రెజినా, నిత్యా మీనన్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు. ట్రైలర్ లో అన్ని పాత్రలు చూపించడం జరిగింది. ఒక పాత్రకు మరో పాత్రకు సంభంధం లేకుండా డిఫరెంట్ గా ఉంది. ట్రైలర్ చూసాక సినిమాలో మంచి పాయింట్ ఉందనే సందేహం కలగక మానదు. ఫిబ్రవరి 16న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ట్రైలర్