బాలీవుడ్ లో 100 కోట్ల రికార్డ్ సృష్టించిన ‘బాహుబలి’

బాలీవుడ్ లో 100 కోట్ల రికార్డ్ సృష్టించిన ‘బాహుబలి’

Published on Aug 3, 2015 3:16 PM IST

baahubali
సుమారు 83 ఏళ్ళ చరిత్ర కలిగిన తెలుగు సినిమా చరిత్రలో 100 కోట్ల మార్క్ ని రీచ్ అయ్యే సినిమా వస్తుందా.? ఇది ఇన్ని రోజులు తెలుగు ప్రేక్షకుల మదిలో ఉన్న ప్రశ్న.. ఈ ప్రశ్నకి సమాధానమే గత నెల జూలై 10వ తేదీన రిలీజ్ అయిన ‘బాహుబలి’. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అన్ని రికార్డ్స్ ని బ్రేక్ చేసేసి ఆల్ టైం తెలుగు ఇండస్ట్రీ రికార్డ్ గానే కాకుండా, అల్ టైం సౌత్ ఇండియా రికార్డ్ ని కూడా బ్రేక్ చేసి అగ్రస్థానంలో కూర్చుంది. ఇక్కడ అందరినీ షాక్ చేస్తున్న విషయం ఏమిటంటే.. అసలు టాలీవుడ్ లో 100 కోట్ల మార్క్ ని క్రాస్ చేస్తేనే ఎక్కువ అని చాలా మంది ఫీలయ్యారు. కానీ ఈ సినిమా ఒక్క తెలుగులోనే కాదు హిందీలో కూడా 100 కోట్ల మార్క్ ని క్రాస్ చేసి సరికొత్త రికార్డ్ ని సృష్టించింది.

అది కూడా ఓ తెలుగు డబ్బింగ్ సినిమా అయిన బాహుబలి హిందీలో 100 కోట్ల మార్క్ ని క్రాస్ చెయ్యడం బాలీవుడ్ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. బాహుబలి సినిమా ఒక్క హిందీ వెర్షన్ లోనే 4వ వీకెండ్ వరకూ కలుపుకొని 103.51 కోట్లు కలెక్ట్ చేసి హిందీలో సరికొత్త బెంచ్ మార్క్ ని క్రియేట్ చేసింది. హిందీలో డబ్ అయ్యి రిలీజ్ అయ్యే సినిమాలే తక్కువ, అలా అయినా కలెక్ట్ చేసేది చాలా తక్కువ కానీ బాహుబలి మాత్రం వాటన్నిటికీ విరుద్దంగా ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ అవ్వడమే కాకుండా నాలుగు వారాలుగా విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. హిందీ వెర్షన్ లో టాప్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అయిన కరణ్ జోహార్ ఈ సినిమాని రిలీజ్ చెయ్యడం కూడా పెద్ద హెల్ప్ అయ్యింది.

రెబల్ స్టార్ ప్రభాస్, రానా, తమన్నా, అనుష్క ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకి ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు