బాహుబలికి ఆస్కార్ ఇవ్వాలి – చంద్రబాబు నాయుడు
Published on May 3, 2017 4:15 pm IST


రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి – ది కంక్లూజన్’ చిత్రం గత నెల 28న విడుదలై అన్ని చోట్ల భారీ వసూళ్లతో విజయవంతంగా నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఏ భారతీయ సినిమాకు సాధ్యంకాని వసూళ్లను సాధించిన ఈ చిత్రాన్ని సామాన్య ప్రేక్షకులతో పాటు స్టార్ హీరోలు, దిగ్గజ దర్శకులు, బడా నిర్మాతలు పొగడ్తలతో ముంచెత్తుంటే తాజాగా ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా సినిమాను చూసి అద్భుతం అంటూ కొనియాడారు.

అంతేగాక ఈ సినిమాకు ఆస్కార్ బహుమానం ఇవ్వాలని, కేంద్రంతో మాట్లాడి మన దేశం తరపున ఈ చిత్రాన్ని ఆస్కార్ నామినేషన్స్ కు వెళ్లేలా చేస్తామని అన్నారు. ఈ చిత్రం తెలుగువారి ప్రతిభకు, గొప్పతనానికి ఒక నిదర్శనమని, తాను దర్శకుడు రాజమౌళి, నటుడు రానాలతో కూడా పర్సనల్ గా ఫోన్లో మాట్లాడినట్టు తెలిపారు.

 
Like us on Facebook