యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సుహాస్ ప్రధాన పాత్రలో నటించిన యూనిక్ సస్పెన్స్ థ్రిల్లర్ ప్రసన్న వదనం చిత్రం వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ అయ్యింది. స్టార్ డైరెక్టర్ సుకుమార్ వద్ద అసోసియేట్ గా పని చేసిన అర్జున్ వై కె దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జెఎస్ మణికంఠ, టి ఆర్ ప్రసాద్ రెడ్డి నిర్మించారు. పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్ హీరోయిన్స్ గా నటించారు. ఈ చిత్రం కి విమర్శకుల నుండి ప్రశంసలు వస్తున్నాయి.
ఈ చిత్రం పై ఇప్పటికే పలు ప్రశంసల వర్షం కురిపించారు స్టార్ డైరెక్టర్ సుకుమార్. సినిమాను చూడండి అంటూ ప్రోత్సహించారు సుకుమార్. తాజాగా ఈ చిత్రం కోసం ఒక ఇంటర్వ్యూ చేశారు. తన శిష్యుడు బుచ్చిబాబు సన తో కలిసి హీరో సుహస్ ను, డైరెక్టర్ అర్జున్ ను ఇంటర్వ్యూ చేయనున్నారు. ఈ ఇంటర్వ్యూ త్వరలో రిలీజ్ కానుంది. బుచ్చిబాబు సన తదుపరి రామ్ చరణ్ తో RC16 ను చేయనున్నారు. ప్రస్తుతం పుష్ప 2 ది రూల్ చిత్రం తో బిజీగా ఉన్న సుకుమార్, రామ్ చరణ్ తో RC17 అనే చిత్రం ను చేయనున్నారు. ఫేస్ బ్లైండ్ నెస్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రం లాంగ్ రన్ లో మంచి వసూళ్లను రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.