కంటెంట్ బాగుండి, కొన్నేళ్ల క్రితం బ్లాక్ బస్టర్ సాధించిన చిత్రాలు రీ రిలీజ్ అయ్యి 100 రోజులు నడిచిన రోజులు ఉన్నాయి. కానీ ప్రస్తుతం ఉన్న డిజిటల్ ప్లాట్ ఫామ్ లతో రీ రిలీజ్ లు అన్ని చిత్రాలకు ప్లస్ కావడం లేదు. అయితే ప్రొడ్యూసర్ ఎ. ఎమ్. రత్నం నిర్మించిన గిల్లి మూవీ రీ రిలీజ్ అయ్యింది. విజయ్ మరియు త్రిష లు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం రీ రిలీజ్ కి అద్దిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. వరల్డ్ వైడ్ గా ఇప్పటి వరకూ 30 కోట్ల రూపాయల కి పైగా వసూళ్లు రాబట్టింది. ఇది సెన్సేషన్ రెస్పాన్స్ అని చెప్పాలి. ఒక విధంగా తొలిసారి థియేటర్ల లో రిలీజ్ అయిన దానికంటే కూడా ఎక్కువ వసూళ్లను సాధించింది ఈ చిత్రం. ఇది రీ రిలీజ్ లలో ఆల్ టైమ్ రికార్డు.
అయితే ఇప్పుడు ఉన్న టఫ్ టైమ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న హరిహర వీరమల్లు చిత్రం టీజర్ విడుదల అయ్యి సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. టీజర్ రిలీజ్ తర్వాత సినిమా పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో మరింత అంచనాలు పెరిగాయి. సినిమా వాయిదా పడినప్పటికీ, క్వాలిటీ విషయం లో ఏ మాత్రం రాజుపడటం లేదు మేకర్స్. ఈ చిత్రం కి కూడా ఎ. ఎమ్. రత్నం నిర్మాత గా వ్యవహరిస్తున్నారు. ఈ రెండు చిత్రాల విషయం లో ప్రొడ్యూసర్ చాలా సంతోషం గా ఉన్నట్లు తెలుస్తోంది.
సినిమాను సకాలంలో పూర్తి చేసేందుకు యువ దర్శకుడు జ్యోతికృష్ణ పగ్గాలు చేపట్టారు. ఇంత పెద్ద ప్రాజెక్ట్‌ని చక్కగా హ్యాండిల్ చేయగలడు అని రిలీజైన టీజర్ ను చూసి చెప్పవచ్చు. ఈ విజువల్ గ్రాండియర్ కి ఆస్కార్ విన్నింగ్ కంపోజర్ ఎంఎం కీరవాణి అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ హైలైట్ గా నిలిచింది. అంతేకాక మొదటిసారిగా పవన్ కళ్యాణ్‌ని ఇలాంటి సెట్టింగ్‌లో చూడటం అందరికీ ఒక హై ఇచ్చింది.