‘బాహుబలి’లో షారుక్.. మొత్తం విషయం బయటపెట్టిన టీమ్ !
Published on Feb 14, 2017 5:09 pm IST


ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్, దేశంలోని సినీ అభిమానులంతా ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్న చిత్రం ‘బాహుబలి 2’ గురించి కొన్ని రోజులుగా వార్త ఒకటి బాగా ప్రచారంలో ఉంది. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఈ చిత్రంలో ఒక అతిధి పాత్ర చేస్తున్నాడనేది ఆ వార్త సారాంశం. ఈ వార్త విన్న చాలా మందిలో బాహుబలికి బాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ఉంది కనుక షారుక్ నటించే ఉంటాడని కొందరంటే అలాంటిదేమీ లేదని మరికొందరన్నారు. ఈ వాదనలతో వార్తపై పూర్తి కన్ఫ్యూజన్ నెలకొంది.

ఈ వార్తలన్నింటినీ గమనించిన బాహుబలి టీమ్ ‘షారుఖ్ మా సినిమాలో నటించాలని మాకు ఉంది. అలా ఎవరు మాత్రం కోరుకోరు? కానీ ఈ వార్త మాత్రం పూర్తిగా పుకారు. ఇందులో ఎంత మాత్రం నిజం లేదు’ అంటూ ట్విట్టర్లో క్లారిటీ ఇచ్చింది. గతంలో కూడా పలు సందర్భాల్లో టీమ్ ఇలాంటి చాలా పుకార్లపై స్పష్టత ఇస్తూ రావడం తెలిసిందే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

 
Like us on Facebook