సోషల్ మీడియాలో బాలకృష్ణ సంచలనం !

15th, October 2016 - 10:57:19 AM

Gautamiputra-Satakarni

నందమూరి బాలకృష్ణ చేస్తున్న ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చిత్రంపై అంచనాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ మధ్యే విడుదలైన ఈ చిత్రం యొక్క టీజర్ కు బ్రహ్మాండమైన స్పందన వస్తోంది. ఈ టీజర్ విడుదలైన నాలుగు రోజులకే 20 లక్షల పై చిలుకు వ్యూస్ సాధించింది. ఈ మధ్య కాలంలో విడుదలైన ఏ చిత్రానికీ ఇంత గొప్ప ఆదరణ దక్కలేదు. ముఖ్యంగా పరాశ్రమలోని సీనియర్ హీరోల్లో టీజర్ తోనే ఇంత సెన్సేషన్ క్రియేట్ చేసింది బాలకృష్ణ మాత్రమే అని చెప్పొచ్చు. ఇందులో బాలయ్య శాతకర్ణి గెటప్ లో చెప్పిన పవర్ ఫుల్ డైలాగులు, యుద్ధ సన్నివేశాలు నందమూరి అభిమానుల్ని అమితంగా ఆకట్టుకున్నాయి.

కథ మూలంగా ఆరంభం నుండే ఈ చిత్రం పై మంచి అంచనాలున్నాయి. ఈ టీజర్ తో అవి కాస్త తారా స్థాయికి చేరుకున్నాయి. ఇక ట్విట్టర్, ఫేస్ బుక్ లలో అయితే బాలయ్య పేరు మారు మ్రోగిపోతోంది. దర్శకుడు క్రిష్ తెరెక్కిస్తున్న ఈ చారిత్రక చిత్రం 2017 సంక్రాంతి సందర్బంగా విడుదల కానుంది. ఇందులో బాలయ్య సరసన శ్రియ శరన్ హీరోయిన్ గా నటిస్తుండగా డ్రీమ్ గర్ల్ హేమమాలిని బాలయ్య తల్లి పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రంలోని యుద్ధ సన్నివేశాలు, ఇతర ముఖ్యమైన సన్నివేశాల షూటింగ్ ముగిసింది. దర్శకుడు క్రిష్, రాజీవ్ రెడ్డిలు సంయుక్తంగా నిర్మిసున్న ఈ సినిమాకి చిరంతన్ భట్ సంగీతాన్ని అందిస్తున్నారు.