విభిన్న గెటప్స్ లో కనిపించబోతున్న బాలకృష్ణ!
Published on Feb 19, 2018 8:03 pm IST

తేజ దర్శకత్వంలో బాలకృష్ణ చేయబోయే ఎన్టీఆర్ బయోపిక్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. త్వరలో మొదలుకానున్న ఈ సినిమాలో బాలకృష్ణ 60 విభిన్న పాత్రల్లో కనిపించబోటున్నట్లు సమాచారం. ఇందుకోసం గెటప్స్ కూడా ఫైనల్ చేశారని తెలుస్తోంది. ఈ చిత్రంలో నటించబోయే కొన్ని పాత్రల కోసం కొత్త టెక్నాలజిని వాడుతున్నారని సమాచారం.

ప్రస్తుతం తేజ వెంకటేష్ సినిమా పనిలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తి అయిన వెంటనే ఎన్టీఆర్ బయోపిక్ సినిమా ప్రారంభం చెయ్యాలనే ఆలోచనలో ఉన్నాడు. బయోపిక్ సినిమా కోసం నటీనటుల ఎంపిక జరుగుతోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ లభించింది.

 
Like us on Facebook