లేటెస్ట్ బజ్: “లైగర్” మూవీలో బాలయ్య?

Published on Dec 3, 2021 3:01 am IST


టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా, అనన్య పాండే హీరోయిన్‌గా డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ “లైగర్”. ఈ భారీ పాన్ ఇండియన్ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్ మరియు పూరి కనెక్ట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ప్రముఖ బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ మూవీలో నందమూరి బాలకృష్ణ కూడా ఒక ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నాడన్న బజ్ ఇప్పుడు వినిపిస్తుంది.

అయితే పూరిజగన్నాథ్ దర్శకత్వంలో బాలకృష్ణ ‘పైసా వసూల్’ సినిమా చేయగా, అందులో బాలయ్య మాస్ క్యారెక్టర్ ప్రతి ఒక్కరిని ఫిదా చేసిందనే చెప్పాలి. దీంతో పూరిపై ఉన్న నమ్మకంతో లైగర్‌లో ఒక క్యామియో రోల్ లో కనిపించడానికి బాలయ్య ఒప్పుకున్నాడని సమాచారం. మరీ ఈ వార్తలో ఎంత నిజముందో తెలియాలంటే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే.

సంబంధిత సమాచారం :