బాలీవుడ్ ప్రెస్టీజియస్ చిత్రం రామాయణ ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ హైప్ క్రియేట్ చేసింది. నితేష్ తివారి డైరెక్ట్ చేస్తు్న్న ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్నారు. దీంతో ఈ ఎపిక్ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు వీక్షిద్దామా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
ఇక ఈ సినిమాను పలు భాషల్లో గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్(SVC) వారు రిలీజ్ చేస్తారని సినీ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట.
ఈ సినిమాలో కన్నడ రాక్‌స్టార్ యష్ రావణుడి పాత్రలో నటిస్తున్నాడు. నమిత్ మల్హోత్రా అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాను దీపావళి కానుకగా రిలీజ్ చేయనున్నారు.


