మెగా హీరో సినిమాకు బడ్జెట్ కష్టాలు..?

మెగా హీరో సినిమాకు బడ్జెట్ కష్టాలు..?

Published on Oct 7, 2026 9:09 PM IST

కిరణ్ అబ్బవంర హీరోగా నటించిన ‘క’ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. సుజిత్ – సందీప్ ద్వయం టాలీవుడ్‌లో మంచి దర్శకులుగా క్రేజ్ సంపాదించుకున్నారు. ఆ సినిమా క్లైమాక్స్ ప్రేక్షకులను మెప్పించడంతో సాయిధరమ్ తేజ్ వీరితో ఒక ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

నిర్మాత సాహు గారపాటి బ్యానర్‌లో ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా మొదలయ్యాయి. అయితే, అనూహ్యంగా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై ఎలాంటి ముందడుగు పడకపోవడమే కాకుండా, ప్రస్తుతం ఈ సినిమా హోల్డ్‌లో పడినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్ ఆగిపోవడానికి ప్రధాన కారణం భారీ బడ్జెట్ అని తెలుస్తోంది. ఇప్పుడు వేరే ప్రొడక్షన్ హౌస్ కోసం చర్చలు జరుగుతున్నాయి. సాయిధరమ్ తేజ్‌తో రూ. 30 నుంచి 40 కోట్ల బడ్జెట్‌లో సినిమా చేస్తేనే ప్రొడ్యూసర్లకు వర్కవుట్ అవుతుంది.

ఇప్పటికే ఆయన నటిస్తున్న ‘సంబరాల ఏటి గట్టు’ చిత్రానికి దాదాపు రూ. 90 కోట్లు ఖర్చవ్వడంతో ఈ చిత్రం 2027 సంక్రాంతికి వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ‘క’ దర్శకుల కథ కోసం అంత భారీ మొత్తాన్ని రిస్క్ చేయడానికి కొత్త నిర్మాతలు ముందుకు వస్తారో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు