టాలీవుడ్ టాప్ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఇటీవల విడుదల చేసిన ‘ఇరుముడి’, ‘మొధ రాత్రి’ చిత్రాలు థియేటర్లలోనే కాక ఓటీటీలోనూ సరికొత్త రికార్డులతో దూసుకెళ్తున్నాయి. భారీ అంచనాలతో వచ్చి సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న ‘ఇరుముడి’తో పాటు, ఎటువంటి హడావుడి లేకుండా వచ్చి బాక్సాఫీస్ వద్ద స్లీపర్ హిట్‌గా నిలిచిన ‘మొధ రాత్రి’ చిత్రాలు డిజిటల్ లవర్స్‌ను అమితంగా ఆకట్టుకుంటున్నాయి.
ఈ రెండు సినిమాలు ఊహించని రీతిలో వ్యూస్ సాధించడంతో నెట్‌ఫ్లిక్స్ ఇండియా టీమ్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌తో పాటు ఆయా చిత్రబృందాలను ప్రత్యేకంగా కలిసి ఈ గ్రాండ్ సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకుంది. ఒకే నిర్మాణ సంస్థ నుంచి వచ్చిన రెండు సినిమాలు ఒకేసారి నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ చార్ట్స్‌లో అత్యధికంగా వీక్షించిన ‘టాప్ 2 నాన్-ఇంగ్లీష్’ చిత్రాలుగా నిలవడం డిజిటల్ ప్లాట్‌ఫామ్ చరిత్రలోనే ఒక అరుదైన ఘనత.
మైత్రీ మూవీ మేకర్స్ ఎంచుకునే కథాబలానికి, మేకింగ్ ప్రమాణాలకు ఈ రికార్డే సరైన నిదర్శనమని చెప్పవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల నుంచి లభిస్తున్న ఈ సాలిడ్ రెస్పాన్స్ పట్ల చిత్ర నిర్మాతలు ఆనందాన్ని వ్యక్తం చేశారు.


