“అన్‌ స్టాపబుల్” షో షూట్ మొదలెట్టేసిన బాలయ్య..!

“అన్‌ స్టాపబుల్” షో షూట్ మొదలెట్టేసిన బాలయ్య..!

Published on Oct 22, 2021 12:25 AM IST


నందమూరి బాలకృష్ణ ఓటీటీ వేదిక ఆహాలో ‘అన్ స్టాపబుల్’ అనే కార్యక్రమం ద్వారా బుల్లితెర ప్రేక్షకులను మెప్పించేందుకు రెడీ అయిన సంగతి తెలిసిందే. అల్లు అరవింద్ నిర్మాణంలో నవంబర్ 4వ తేది నుంచి ప్రసారం కానున్న ఈ షో మొత్తం 12 ఎపిసోడ్‌లుగా స్ట్రీమింగ్ కానుంది. అయితే తాజాగా ఈ టాక్ షో ప్రోమో చిత్రీకరణలో బాలకృష్ణ పాల్గొన్నట్టు తెలుస్తుంది.

డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సారధ్యంలో ప్రోమో కోసం కొన్ని షాట్లను చిత్రీకరించినట్టు ఆహా పేర్కొంది. దీనికి సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి. అంతేకాకుండా త్వరలోనే ఈ టాక్ షో ప్రోమోను విడుదల చేస్తున్నట్టు ఆహా తెలిపింది. ఇదిలా ఉంటే బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌లో తెరకెక్కిన “అఖండ” సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు