బాలయ్య రాకతో షూటింగ్ లో సందడి !
Published on Nov 28, 2017 9:25 am IST

హీరో మోహన్ బాబు 42 ఏళ్ళు సినీ ప్రస్థానాన్ని కొనసాగించారు. ఎన్నో బాక్స్ ఆఫీస్ విజయాలను ఆయన సొంతం చేసుకున్నారు. దాదాపు రెండేళ్ల గ్యాప్ తరువాత ఈ సీనియర్ హీరో కథ నచ్చి ఒక సినిమాను ఒప్పుకున్నారు ఆ చిత్రం పేరు ‘గాయత్రి’. మదన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు. డైమండ్ రత్నబాబు కథ మాటలు అందించారు.

ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటిలో జరుగుతోంది. నిన్న షూటింగ్ సెట్లో అడుగుపెట్టిన బాలయ్య కాసేపు మోహన్ బాబు తో చిత్ర యూనిట్ సభ్యులతో ముచ్చటించారు. బాలయ్య రాకతో షూటింగ్ వాతావరణం సందడిగా మారింది. మంచి కథ కథనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా తప్పకుండా మంచి విజయం సాధిస్తుందని చిత్ర యూనిట్ నమ్మకంగా ఉంది.

 
Like us on Facebook