వైరల్ : “బాలయ్య 107” షూట్ దగ్గర వయసైనా లేడీ ఫ్యాన్ మాస్ హంగామా.!

Published on Jul 26, 2022 2:00 pm IST

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రస్తుతం తన కెరీర్ లో 107వ సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రం షూటింగ్ ని మేకర్స్ శరవేగంగా తెరకెక్కిస్తున్నారు. ఇక బాలయ్య ఫ్యాన్ ఫాలోయింగ్ కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ “జై బాలయ్య” అంటారు.

ఇక లేటెస్ట్ గా ఈ సినిమా షూటింగ్ సెట్స్ దగ్గర అయితే ఒక సూపర్ వీడియోని మేకర్స్ పోస్ట్ చేయగా ఇది వైరల్ అవుతుంది. ఈ షూటింగ్ స్పాట్ లో ఒక వయసైన బామ్మ జై బాలయ్య జై జై బాలయ్య అంటూ మాస్ హంగామా చేయడమే కాకుండా విజిల్స్ వేస్తూ అక్కడ ఉన్న యూత్ ని డామినెంట్ చేసే లెవెల్లో అదరగొట్టింది.

దీనితో ఈ మాసివ్ మూమెంట్ ని మేకర్స్ తమ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకోగా వీడియో ఇప్పుడు మంచి వైరల్ గా మారింది. మరి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :