నైజాం, కృష్ణలో ఓన్ రిలీజ్ చేస్తున్న బండ్ల గణేష్

Published on Sep 28, 2014 10:30 pm IST

ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న నిర్మాతల్లో బ్లాక్ బస్టర్ నిర్మాతగా పేరుతెచ్చుకున్న బండ్ల గణేష్ సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేయడమే కాకుండా సినిమాని బ్లాక్ బస్టర్ చేయడం కోసం ఏమేమి చేయాలో అన్నీ చేస్తారు. ఆ విషయంలో ఖర్చుకి ఎక్కడా వెనుకాడరు. ప్రస్తుతం బండ్ల గణేష్ ముద్దుగా లిటిల్ స్టార్ అని పిలుచుకునే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమాని నిర్మించాడు.

ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 1న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని సెన్సార్ నుంచి సూపర్బ్ ఫిల్మ్ అని ఫీడ్ బ్యాక్ అందుకున్న ఈ సినిమా విజయంపై బండ్ల గణేష్ కి 200% నమ్మకం ఉండడంతో ఆయనే ఈ సినిమాని నైజాం మరియు కృష్ణా ఏరియాల్లో ఓన్ గా రిలీజ్ చేస్తున్నారు. ఒక నిర్మాతగానే కాకుండా డిస్ట్రిబ్యూటర్ గా కూడా అన్ని పనులు పర్ఫెక్ట్ గా చూసుకుంటున్నాడు.

కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ఈ దృశ్యకావ్యం లాంటి కుటుంబ కథా చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, ప్రకాష్ రాజ్, శ్రీ కాంత్, కమలినీ ముఖర్జీ, జయసుధ కీలక పాత్రలు పోషించారు.

సంబంధిత సమాచారం :