నాగ్, చైతూల “బంగార్రాజు”కి వచ్చిన కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Published on Feb 2, 2022 2:30 am IST

అక్కినేని నాగార్జున, నాగ చైతన్య హీరోలుగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “బంగార్రాజు”. జీ స్టూడియోస్ సమర్పణలో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి పోటీగా పెద్ద చిత్రాలేవి లేకపోవడంతో ఈ మల్టీస్టారర్ సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది. అంతేకాదు వసూళ్లను కూడ బాగానే రాబట్టుకుంటుంది.

అయితే ఈ చిత్రం విడుదలై మొన్న సోమవారానికి 18 రోజులు పూర్తయ్యింది. ఓవరాల్‌గా చూసుకుంటే ఈ 18 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.34.62 కోట్ల షేర్ రాబట్టగా, రూ.56.25 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. అయితే వరల్డ్ వైడ్‌గా చూసుకుంటే రూ.37.87 కోట్ల షేర్ రాగా, రూ.63.65 కోట్ల గ్రాస్ వసూలైనట్లు ట్రేడ్ నిపుణుల రిపోర్ట్స్ చెబుతున్నాయి. కాగా విడుదలకు ముందు ఈ చిత్రం రూ.38 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా, రూ.39 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ బరిలోకి దిగింది. అయితే ఇప్పటివరకు వచ్చిన కలెక్షన్స్‌ని చూసుకుంటే మరో రూ.1.13 కోట్ల షేర్ వసూలు చేస్తేనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధిస్తుందని చెప్పాలి.

సంబంధిత సమాచారం :