రూ.200 కోట్లకు చేరువలో ‘బాహుబలి-2’ హిందీ వెర్షన్ !


తెలుగుతో పాటే హిందీలో కూడా భారీ ఎత్తున రిలీజైన ‘బాహుబలి-2’ చిత్రం అక్కడ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఒక తెలుగు సినిమాకు ఇంత స్టామినా ఉందా అనే రీతిలో పెర్ఫార్మ్ చేస్తోంది. ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ సినిమా కోసం చేపట్టిన భారీ స్థాయి ప్రమోషన్లు, సినిమాలోని అద్భుతమైన విజువల్స్, రాజమౌళి విజన్ అన్నీ కలిసి సినిమాకు భారీ విజయాన్ని కట్టబెట్టాయి.

ఓపెంనింగ్ డే శుక్రవారం నాడు 41 కోట్ల నెట్ రాబట్టిన ఈ చిత్రం శని, ఆది, సోమవారాల్లో వరుసగా రూ. 40. 5 కోట్లు, రూ. 46.5 కోట్లు, రూ. 40.25 కోట్లు వసూలు చేసి మంగళవారం నాడు కూడా అదే జోరు కొనసాగించి సుమారు రూ. 30 కోట్ల నెట్ కలెక్ట్ చేసి మొత్తంగా 5 రోజులకు కలిపి రూ. 198.2 కోట్లు రాబట్టింది. ఇక ఈరోజు వచ్చే కలెక్షన్లు కూడా కలుపుకుంటే ‘బాహుబలి-2’ అవలీలగా రూ. 200 కోట్ల మార్క్ దాటేసి ఈ సాయంత్రాని కల్లా బాలీవుడ్ లో ఇంకో సరికొత్త రికార్డ్ ను నెలకొల్పనుంది.