“బెదురులంక 2012” టీవీ ప్రీమియర్ కి రెడీ!

“బెదురులంక 2012” టీవీ ప్రీమియర్ కి రెడీ!

Published on Dec 21, 2023 11:00 AM IST

టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ గుమ్మకొండ హీరోగా, నేహ శెట్టి హీరోయిన్ గా, డైరెక్టర్ క్లాక్స్ దర్శకత్వం లో తెరకెక్కిన విలేజ్ కామెడీ ఎంటర్టైనర్ బెదురులంక 2012. ఈ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద కూడా మంచి వసూళ్లను రాబట్టి, సూపర్ హిట్ గా నిలిచింది ఈ సినిమా. ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయిపోయింది.

ప్రముఖ టీవీ ఛానల్ అయిన స్టార్ మా లో ఈ ఆదివారం మధ్యాహ్నం 1:00 గంటలకు సినిమా ప్రసారం కానుంది. లౌక్య ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై రవీంద్ర బెనర్జీ ముప్పనేని నిర్మించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. బుల్లితెర పై ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు