టీవీ ప్రీమియర్ కి రెడీ అయిన “భాగ్ సాలే”

టీవీ ప్రీమియర్ కి రెడీ అయిన “భాగ్ సాలే”

Published on Dec 26, 2023 3:05 PM IST

ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ అవార్డు విన్నర్ అయిన ఎంఎం కీరవాణి కుమారుడు శ్రీ సింహ కోడూరి ప్రధాన పాత్రలో, ప్రణీత్ దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం భాగ్ సాలే. ఈ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరించడం లో విఫలం అయ్యింది. అయితే ఈ సినిమా మరోసారి ఆడియెన్స్ ను అలరించడానికి రెడీ అయిపోయింది.

ఈ చిత్రం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా డిసెంబర్ 31, 2023 న ప్రముఖ టీవీ ఛానల్ అయిన ఈటీవీ లో రాత్రి 7:00 గంటలకు ప్రసారం కానుంది. నేహా సోలంకి, రాజీవ్ కనకాల, జాన్ విజయ్, వర్షిణి, నందిని రాయ్, హర్ష చెముడు తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కాల భైరవ సంగీతం అందించారు. బిగ్ బెన్ సినిమాస్, సినీవాలి మూవీస్ లతో కలిసి వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించడం జరిగింది. బుల్లితెర పై ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు