ఉస్తాద్ భగత్ సింగ్: ఉస్తాద్ ఊచకోత కి టైమ్ ఫిక్స్!

ఉస్తాద్ భగత్ సింగ్: ఉస్తాద్ ఊచకోత కి టైమ్ ఫిక్స్!

Published on Mar 19, 2024 1:23 PM IST

గబ్బర్ సింగ్ చిత్రం ఏ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకం గా చెప్పాల్సిన అవసరం లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (PSPK) ను సూపర్ స్టైలిష్ గా, పవర్ ఫుల్ గా ప్రెజెంట్ చేశారు, డాషింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. వీరి కాంబినేషన్ లో వస్తున్న మరోచిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaadbhagatsingh). రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

మేకర్స్ ఎట్టకేలకు ఈ చిత్రం కి సంబందించిన సాలిడ్ అప్డేట్ ను అందించారు. ఈ చిత్రం నుండి భగత్’ స్ బ్లేజ్ ( bhagat’s blaze) ను నేడు సాయంత్రం 4:45 గంటలకు రిలీజ్ చేయనున్నారు. ఇదే విషయాన్ని పోస్టర్ ద్వారా వెల్లడించారు. ఈ అప్డేట్ తో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి పెర్ఫార్మెన్స్ బద్దలైపొద్ది అంటూ ఫస్ట్ గ్లింప్స్ పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్ ఆడియెన్స్ ను అలరించింది. ఈ భగత్’ స్ బ్లేజ్ పై మరింత అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం కి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు