డబ్బింగ్ చివరి దశలో ‘భరత్ అనే నేను’ !


విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో ‘భరత్ అనే నేను’ పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు తన పాత్ర తాలూకు డబ్బింగ్ పనుల్లో బిజీగా గడుపుతున్నారు. త్వరలోనే ఈ డబ్బింగ్ పనులు ముగియనున్నాయి. ఇకపోతే ఈ చిత్రం యొక్క ఆడియో వేడుక ఈరోజు సాయంత్రం ఎల్బీ స్టేడియంలో జరగనుంది.

ఈ వేడుకలోనే సినిమాలోని అన్ని పాటల్ని రిలీజ్ చేయనున్నారు. ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా హాజరుకానుండగా సూపర్ స్టార్ కృష్ణగారు కూడ వేడుకలో పాల్గొనబోతున్నారు. ఏప్రిల్ 20న ప్రేక్షకుల ముందుకురానున్న ఈ సినిమాలో మహేష్ బాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా కనపడనున్నారు.