“భీమ్లా నాయక్” పై ఫుల్ కాన్ఫిడెంట్…ఫోటో షేర్ చేసిన నాగ వంశీ!

Published on Nov 21, 2021 5:41 pm IST


పవన్ కళ్యాణ్, రానా దగ్గుపాటి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న భీమ్లా నాయక్ చిత్రం సంక్రాంతి బరిలో దిగేందుకు సిద్ధం అవుతోంది. ఈ చిత్రం విడుదల విషయం లో మేకర్స్ ఫుల్ క్లారిటీ తో దూసుకు పోతున్నారు. అందుకు నిదర్శనమే ఈ ఫోటో. తాజాగా చిత్ర యూనిట్ మరొక ఫోటో ను షేర్ చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఫైట్ సీన్ కి సంబంధించిన ఒక ఫోటో ను షేర్ చేయడం జరిగింది. అంతేకాక ఈ సారి కూడా మిస్ అవ్వదు అంటూ చెప్పుకొచ్చారు ఈ చిత్ర నిర్మాత సూర్య దేవర నాగ వంశీ. జనవరి 12, 2022 కి థియేటర్ల లో కలుద్దాం అంటూ చెప్పుకొచ్చారు.

పవన్ కళ్యాణ్, రానా దగ్గుపాటి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ భీమ్లా నాయక్ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, విడియోలు, పాటలకి భారీ రెస్పాన్స్ వచ్చింది. సాగర్ కే చంద్ర దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు అందిస్తున్నారు. అంతేకాక థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండటం తో సినిమా వేరే లెవెల్ లో ఉండనుంది అని తెలుస్తోంది.
https://mobile.twitter.com/vamsi84/status/1462340484760702978

సంబంధిత సమాచారం :

More