సమీక్ష : భూతద్దం భాస్కర్ నారాయణ – కొన్ని చోట్ల ఆకట్టుకునే థ్రిల్లర్ మూవీ

సమీక్ష : భూతద్దం భాస్కర్ నారాయణ – కొన్ని చోట్ల ఆకట్టుకునే థ్రిల్లర్ మూవీ

Published on Mar 2, 2024 3:11 AM IST
Bhoothaddam Bhaskar Narayana Movie Review in Telugu

విడుదల తేదీ : మార్చి 01, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు: శివ కందుకూరి, రాశి సింగ్, దేవి ప్రసాద్, వర్షిణి సౌందరరాజన్, శివ కుమార్, షఫీ, సురభి సంతోష్, శివన్నారాయణ, వెంకటేష్ కాకుమాను తదితరులు.

దర్శకుడు: పురుషోత్తం రాజ్

నిర్మాతలు : స్నేహల్ జంగాల, శశిధర్ కాసి, కార్తీక్ ముడింబి

సంగీత దర్శకులు: శ్రీచరణ్ పాకాల, విజయ్ బుల్గానిన్

సినిమాటోగ్రాఫర్‌: గౌతమ్ జి

ఎడిటింగ్: గ్యారీ బి హెచ్

సంబంధిత లింక్స్: ట్రైలర్

యువ నటుడు శివ కందుకూరి తాజాగా భూతద్దం భాస్కర్ నారాయణ అనే సస్పెన్స్ యాక్షన్ మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చారు. నేడు రిలీజ్ అయిన ఈ మూవీ యొక్క పూర్తి సమీక్ష ఇప్ప్పుడు చూద్దాం.

 

కథ :

ఈ కథ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక బోర్డర్ లో జరుగుతుంది. ఒక సీరియల్ కిల్లర్ కొందరు ఆడవారిని చంపేసి వారి డెడ్ బాడీస్ ని ఫారెస్ట్ ఏరియాలో పడవేస్తూ ఉంటాడు. అయితే చంపేసిన అమ్మాయిల తలలని మారం కిల్లర్ తీసుకువెళ్లిపోతుంటాడు. అయితే ఆ చనిపోయిన అమ్మాయిలకు సంబంధించి ఒక్క కేసు కూడా బుక్ కాదు. కాగా ఆ ఏరియాలో ఒక చిన్న ప్రైవేట్ డిటెక్టివ్ అయిన భూతద్దం భాస్కర్ నారాయణ (శివ కందుకూరి) ఆ హత్యలకు సంబంధించి ఎటువంటి క్లూస్ కనుక్కోలేకపోతాడు. అయితే ఆ హత్యలతో అతడికి ఒక కనెక్షన్ ఉంటుంది. మరి ఇంతకీ అదేంటి, అసలు ఆ సీరియల్ కిల్లర్ ఎవరు, ఎందుకు ఇదంతా చేస్తూ ఉంటాడు, చంపేసిన అమ్మాయిల తలల్ని తీసుకుని వెళ్ళి అతడు ఏమి చేస్తుంటాడు, చివరికి అతన్ని ఎలా పట్టుకున్నారు అనేది మొత్తం సినిమాలో చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

ఈ కథ మొత్తం కూడా మంచి ఇంట్రెస్టింగ్ వే లో సాగుతుంది. ఒక మైథలాజికల్ స్టోరీతో లింక్ అయిన ఈ మూవీలో పలు సన్నివేశాలు ఆసక్తికరంగా సాగుతాయి. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ బాగా వచ్చాయి. విలన్ గా నటించిన నటుడు అద్భుతంగా పెర్ఫార్మ్ చేసారు. తన గత సినిమా మను చరిత్రతో పోలిస్తే హీరో శివ కందుకూరి తన పాత్రలో ఒదిగిపోయి ఎంతో బాగా నటించారు. భూతద్దం భాస్కర్ నారాయణ అనే డిటెక్టీవ్ గా పలు కీలక సన్నివేశాల్లో చివరివరకు అతడి పెర్ఫార్మన్స్ మనల్ని అలరిస్తుంది. రాశి సింగ్ కూడా తన పాత్రలో బాగా నటించారు. అలానే ఇతర పాత్రధారులు కూడా ఆకట్టుకున్నారు. విజువల్స్ ఈ సినిమాలో బాగుండడంతో పాటు ఆడియన్స్ కి మంచి ట్రీట్ అందిస్తాయి. క్లైమాక్స్ ఎపిసోడ్ లో వచ్చే చిన్న ఇంటి సెటప్ బాగుంది. సినిమాలో ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

మైనస్ పాయింట్స్ :

నిజానికి ఒకప్పటితో పోలిస్తే ఇప్పటి సినీ ఆడియన్స్ ఎంతో తెలివిగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా ఇటువంటి థ్రిల్లింగ్ సినిమాలు తీసేటప్పుడు మేకర్స్ ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇక భూతద్దం భాస్కర్ నారాయణ విషయంలో కిల్లర్ ఎవరు అనేది తెలుసుకోవడానికి ఆడియన్స్ పెద్దగా ఆలోచించాల్సిన పని ఉండదు. అదే ఈ మూవీకి కొంత మైనస్. ఇక కిల్లర్ ఎవరు అనేది తెలిసాకా అందరికీ పెద్దగా థ్రిల్ అనిపించదు. ఇటువంటి సినిమాల్లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సినిమాని ముందుకు నడపాలి. కానీ ఆ అంశం ఈ సినిమాలో అంత ఆసక్తికరంగా లేదు. సరైన బీజీఎమ్ లేకపోవడం వల్లనే కొన్ని సీన్స్ పండలేదు. సౌండ్ మిక్సింగ్ సరిగ్గా లేకపోవడం వలన కొన్ని డైలాగ్స్ మనకు అర్ధం కావు. అలానే సినిమాలో ట్విస్ట్ రివీల్ అయి, మైథలాజికల్ సన్నివేశాలతో కూడిన విలన్ యొక్క బ్యాక్ స్టోరీ ని చెప్పేటప్పుడు వచ్చే యానిమేషన్ సన్నివేశాల విజువల్స్ బాగున్నా సౌండ్ మిక్సింగ్ బాగోదు. ఇక ఫస్ట్ హాఫ్ లో పలు సీన్స్ ఫ్లో తప్పాయి. అలానే మధ్యలో పలు సీన్స్ మధ్యలో చేర్చిన కామెడీ సన్నివేశాలు కూడా కనెక్ట్ కావు అలానే అవి పెద్దగా పండలేదు. సినిమాలో మంచి ఇంటెన్స్ మెయింటెయిన్ అయినా కథనాన్ని ఆసక్తికరంగా ముందుకు తీసుకెళ్లడంలో దర్శకుడు తడబడ్డాడు.

సాంకేతిక వర్గం :

సాంగ్స్ ఆడియో తో పాటు విజువల్ గా కూడా బాగున్నప్పటికీ సరైన మిక్సింగ్ లేకపోవడం వలన కొన్ని డైలాగ్స్ అర్ధం కావు, బిజీఎం కూడా ఆకట్టుకోదు. సినిమా రన్ టైం తగ్గించి ఉండాల్సింది. విజువల్స్ పవర్ఫుల్ గా ఉన్నాయి. దర్శకుడు పురుషోత్తం రాజ్ పనితనం అక్కడక్కడా బాగుంది. కథ బాగున్నా కథనం మరింత ఇంట్రెస్టింగ్ గా ఉంటే బాగుండేది అనిపిస్తుంది. అయితే ఇన్వెస్టిగేషన్ లోని చివరి ఇరవై నిమిషాలు బాగానే సాగుతుంది.

తీర్పు :

ఇక మొత్తంగా చెప్పాలి అంటే శివ కందుకూరి హీరోగా తెరకెక్కిన భూతద్దం భాస్కర్ నారాయణ మూవీ కథ ఇంట్రెస్టింగ్ గా ఉన్నా కథనం ఆకట్టుకోదు. ఫస్ట్ హాఫ్ లో కథకు సంబంధం లేని పలు సీన్స్ ఇబ్బంది పెట్టినా సెకండ్ హాఫ్ బాగానే సాగుతుంది. ఇక చివరి ఇరవై నిమిషాలు ఇంట్రెస్టింగ్ థ్రిల్లింగ్ సీన్స్ తో ఆకట్టుకుంటుంది. హీరో శివ తన పాత్రలో చక్కగా పర్ఫామ్ చేశారు. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ప్రక్కన పెడితే ఈ మూవీ బాగానే ఉంటుందని చెప్పాలి. ఐతే వాటిని పెద్ధగా పట్టించుకోకపోయినట్లైతే ఈవారం భూతద్దం భాస్కర్ నారాయణ మూవీ హ్యాపీ గా చూసి ఎంజాయ్ చేయవచ్చు.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

విడుదల తేదీ : మార్చి 01, 2024 123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5 నటీనటులు: శివ కందుకూరి, రాశి సింగ్, దేవి ప్రసాద్, వర్షిణి సౌందరరాజన్, శివ కుమార్, షఫీ, సురభి సంతోష్, శివన్నారాయణ, వెంకటేష్ కాకుమాను తదితరులు. దర్శకుడు: పురుషోత్తం రాజ్ నిర్మాతలు : స్నేహల్ జంగాల, శశిధర్ కాసి, కార్తీక్ ముడింబి సంగీత దర్శకులు: శ్రీచరణ్ పాకాల, విజయ్ బుల్గానిన్ సినిమాటోగ్రాఫర్‌: గౌతమ్ జి ఎడిటింగ్: గ్యారీ బి...సమీక్ష : భూతద్దం భాస్కర్ నారాయణ - కొన్ని చోట్ల ఆకట్టుకునే థ్రిల్లర్ మూవీ