మరో గొప్ప పనికి శ్రీకారం చుట్టిన బాలక్రిష్ణ !

నందమూరి బాలక్రిష్ణ ఆధ్వర్యంలో నడపబడుతున్న హైదరాబాద్లోని బసవతారకం ఇండో ఆమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఎంతోమందికి సెలవందిస్తున్న సంగతి తెలిసిందే. 2000వ సంవత్సరంలో ఈ ఆసుపత్రి ప్రారంభింపబడింది. ఇలాంటి వైద్య సదుపాయాన్ని అమరావతిలో కూడా ప్రారంభించనున్నారు బాలయ్య.

అమరావతి సమీపంలోని తుళ్లూరు గ్రామంలో ఫిబ్రవరి 3వ తేదీన ఆసుపత్రికి భూమిపూజ నిర్వహించి శంఖుస్థాపన చేయనున్నారు. ప్రపంచస్థాయి వైద్య వసతులతో నిర్మితంకానున్న ఈ ప్రాజెట్ కోసం ఏపి ప్రభుత్వం 15 ఎకరాల భూమిని కేటాయించి, అన్ని రకాల అనుమతులను జారీచేసింది. రాబోయే రెండేళ్ల కాలంలో హాస్పిటల్ కట్టడాన్ని పూర్తిచేసి వినియోగంలోకి తీసుకురావాలనుకుంటున్నారు బాలయ్య.