రాజమౌళి సినిమా బడ్జెట్ ఎంతో తెలుసా !

రాజమౌళి దర్శకత్వంలో త్వరలో ఒక భారీ మల్టీస్టారర్ చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కథానాయకులుగా నటించనున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

‘బాహుబలి’ సిరీస్ తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడం, ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తున్న చిత్రం కావడం మూలాన నిర్మాత డివివి. దానయ్య రూ. 250 కోట్ల భారీ బడ్జెట్ ను ఈ చిత్రంపై వెచ్చిస్తున్నారు. సాంకేతికంగా కూడ హై స్టాండర్డ్స్ లో ఉండనున్న ఈ సినిమాలో హీరోయిన్లు, ఇతర నటీనటులెవరు అనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది.