బిగ్ అప్డేట్ : బన్నీ సెన్సేషనల్ హిట్ కాంబో మళ్ళీ రిపీట్.?

Published on Oct 28, 2021 11:00 am IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన లాస్ట్ చిత్రం “అల వైకుంఠపురములో”. ఒక్క అల్లు అర్జున్ కెరీర్ లోనే కాకుండా టాలీవుడ్ లో కూడా భారీ హిట్స్ లో లాస్ట్ హిట్ కూడా ఇదే అని అందరికీ తెలుసు. మరి అల్లు అర్జున్ మరియు త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన ఈ హ్యాట్రిక్ సినిమా అన్ని వర్గాల్లో హిట్ అయ్యింది. అంతే కాకుండా థమన్, నిర్మాత చినబాబు తో ఈ చిత్రాన్ని నిర్మాణం వహించి సెన్సేషనల్ హిట్ ని వారు అందుకున్నారు.

మరి ఈ హిట్ కాంబో మళ్ళీ రిపీట్ అవ్వనున్నట్టుగా నిర్మాత నాగవంశీ హింట్ ఇస్తున్నారు. తాను త్రివిక్రమ్, అల్లు అర్జున్ అలాగే థమన్ ల ఫోటో షేర్ చేసి ఒక సర్ప్రైజ్ అనౌన్సమెంట్ ను అందిస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. దీనితో ఈ కాంబో నుంచి ఓ బిగ్ ప్రాజెక్ట్ రానున్న రోజుల్లో అనౌన్స్ అవ్వబోతున్నట్టుగా మనం అర్ధం చేసుకోవచ్చు. మరి ఈ చిత్రం మహేష్ తో త్రివిక్రమ్ చేసిన సినిమా తర్వాత ఉంటుందేమో చూడాలి.

సంబంధిత సమాచారం :

More