బిగ్ బాస్ 5: హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చి షాక్ ఇచ్చిన సిరీ వాళ్ళ అమ్మ!

Published on Nov 25, 2021 12:33 pm IST

బిగ్ బాస్ రియాలిటీ షో ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అక్కినేని నాగార్జున వ్యాఖ్యాత గా వ్యవహరిస్తున్న ఈ షో రోజురోజుకీ మరింత ఆసక్తి గా సాగుతోంది. అయితే నేడు జరగబోయే ఎపిసొడ్ కి సంబంధించిన ప్రోమో ను స్టార్ మా విడుదల చేయడం జరిగింది. ఈ ప్రోమో ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.

మానస్ వాళ్ళ అమ్మ వచ్చి కుటుంబ సభ్యులతో ఆనందం గా ఉండి అందరినీ పలకరించి వెళ్లిపోవడం జరిగింది. అయితే అదే విధంగా సిరి వాళ్ళ అమ్మ సైతం హౌజ్ లోకి అడుగు పెట్టడం జరిగింది. సిరి గేమ్ బాగా ఆడుతున్నట్లు తెలిపింది. ఈ సమయం లోనే షణ్ముఖ్ హగ్ చేసుకోవడం నాకు నచ్చడం లేదు అంటూ చెప్పుకొచ్చారు. బాగా హెల్ప్ చేస్తున్నాడు, కానీ అలా హగ్ చేసుకోవడం నచ్చడం లేదు అంటూ చెప్పుకొచ్చారు. సిరి వాళ్ళ అమ్మ చేసిన వ్యాఖ్యల కి షణ్ముఖ్ ఎలా రియాక్ట్ అవుతాడు, నేడు ఏం జరగనుంది అనేది తెలియాలి అంటే షో చూడాల్సిందే.

సంబంధిత సమాచారం :

More