బిగ్‌బాస్ 5: అప్పుడే ఫస్ట్ లవ్ స్టోరీ మొదలైపోయిందిగా..!

Published on Sep 9, 2021 3:00 am IST


బిగ్ రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగులో తాజాగా సీజన్ 5 ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే తొలి వారం నుంచే కంటెస్టెంట్ల మధ్య మొదలైన గొడవలు రక్తి కట్టిస్తున్నాయి. ఇదిలా ఉంటే ప్రతి సీజన్‌లో కంటెస్టెంట్ల మధ్య గొడవలు, లవ్ స్టోరీలు అనేది కామన్‌గా చూస్తూనే వస్తున్నాం. అయితే ఈ సీజన్‌లో కేవలం మూడు రోజుల్లోనే ఓ లవ్ స్టోరీ బయటికి రావడం ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది.

ప్రస్తుతం హౌస్‌లో ఉన్న చాలా మంది కంటెస్టెంట్స్‌కు వివాహం అయ్యింది. కేవలం ఒకరిద్దరు మాత్రమే సింగిల్స్ ఉన్నారు. అయితే ట్రాన్స్‌ జెండర్‌ ప్రియాంక సింగ్‌ తనకు మానస్‌పై క్రష్ ఉందని ఓపెన్‌గా చెప్పేసింది. హౌస్‌లో ఉన్న మేల్ కంటెస్టెంట్లందరిని అన్నయ్య అని పిలుస్తున్న ప్రియాంక మానస్‌ని మాత్రం అలా పిలవలేనని అంటుంది. దీంతో హౌస్‌లోని మిగతా సభ్యులంతా ప్రియాంక-మానస్‌లది తొలి జోడీ అంటూ ఆటపట్టిస్తున్నారు. మరీ మున్ముందు ఈ జోడీ కథ ఎలాంటి మలుపులు తీసుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :