తెలుగు స్టేట్స్ లో “బింబిసార” సెన్సేషనన్.. డే 1 అదిరే వసూళ్లు.!

Published on Aug 6, 2022 11:04 am IST

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా సంయుక్త మీనన్ మరియు క్యాథరిన్ లు హీరోయిన్స్ గా దర్శకుడు వశిష్ట తెరకెక్కించిన లేటెస్ట్ సాలిడ్ విజువల్ డ్రామా “బింబిసార”. భారీ అంచనాలు నడుమ రిలీజ్ అయ్యిన ఈ చిత్రం అన్ని అంచనాలు అందుకొని టాలీవుడ్ కి అత్యవసరంగా కావాల్సిన భారీ హిట్ ని అందుకుంది. మరి మొదటి ఆట నుంచే మంచి రెస్పాన్స్ ని అందుకున్న ఈ చిత్రం తెలుగు స్టేట్స్ లో మంచి ఓపెనింగ్స్ కొల్లగొట్టినట్టుగా తెలుస్తుంది.

తెలుగులో ఈ చిత్రం 6.3 కోట్ల షేర్ మార్క్ ని అందుకుందట. ఇది మాత్రం సాలిడ్ నెంబర్ అని చెప్పాలి. అలాగే ఈ వసూళ్లతో అయితే ఈ చిత్రం మొదటి రోజు లోనే 50 శాతం వసూళ్లు రాబట్టేసినట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. ఇంకా ఎలాగో సినిమా టాక్ బాగా వచ్చింది కాబట్టి ఈ వారాంతంలో మరింత బెటర్ వసూళ్లు నమోదు అవ్వడం ఖాయం అని చెప్పొచ్చు. అలాగే ఆల్రడీ మరిన్ని థియేటర్స్ ఈ సినిమాకి దక్కుతున్నాయని కూడా టాక్ ఉంది. మరి మొత్తానికి అయితే బింబిసార బాక్సాఫీస్ హిట్ గా నిలిచింది.

సంబంధిత సమాచారం :