న‌లుగురు హీరోయిన్స్‌తో రొమాంటిక్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్ !

Published on Jan 21, 2019 8:04 pm IST

బాలు ద‌ర్శక‌త్వంలో బ్లాక్ అండ్ వైట్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ప్రొడ‌క్షన్ నెం.1గా కొత్త చిత్రం సోమ‌వారం హైద‌రాబాద్‌లో ప్రారంభమైంది. హిమ బిందు వెల‌గ‌పూడి నిర్మాణంలో ఈ సినిమా తెర‌కెక్క‌నుంది. ఈ సంద‌ర్భంగా.. ద‌ర్శ‌కుడు బాలు మాట్లాడుతూ – ‘మ‌హాన‌గ‌రంలో నివ‌సిస్తూ స్వ‌తంత్య్ర భావాలున్న న‌లుగురు అమ్మాయిల‌కు సంబంధించిన క‌థే ఈ చిత్రం. త్రిదా చౌద‌రి, ధ‌న్య బాల‌కృష్ణ‌, సిద్ధి ఇద్నాని, కొమ‌లి ప్ర‌సాద్ నలుగురు అమ్మాయిలుగా న‌టిస్తున్నారు. కామెడీ ప్ర‌ధానంగా సాగే ఈ సినిమాలో క‌థానుగుణంగా ఉండే ట్విస్ట్స్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటాయని అన్నారు.

నిర్మాత హిమబిందు వెల‌గ‌పూడి మాట్లాడుతూ – “హైద‌రాబాద్‌లో నేటి నుండి తొలి షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంది. ఫిబ్ర‌వ‌రిలో గోవాలో సెకండ్ షెడ్యూల్‌ను చిత్రీక‌రిస్తాం. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి మే నెల‌లో సినిమాను విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం“ అన్నారు.

ఈ చిత్రానికి సంగీతం: ర‌ఘుకుంచె, సినిమాటోగ్ర‌ఫీ: శేఖ‌ర్ గంగ‌మోని, ఎడిటింగ్‌: నాగేశ్వ‌ర్ రెడ్డి, నిర్మాత‌: హిమ బిందు వెల‌గపూడి, ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: బాలు.

సంబంధిత సమాచారం :

X
More