బన్నీతో నటించాలి అంటున్న ఈ బాలీవుడ్ సీనియర్ నటుడు.!

Published on Jan 29, 2022 1:07 pm IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన లేటెస్ట్ భారీ బ్లాక్ బస్టర్ హిట్ “పుష్ప”. పాన్ ఇండియన్ వైడ్ కూడా సాలిడ్ రెస్పాన్స్ సహా భారీ వసూళ్లు కొల్లగొట్టిన ఈ చిత్రం ఓవరాల్ గా సినిమా పైనే కాకుండా ఈ సినిమా హీరో అల్లు అర్జున్ పెర్ఫామెన్స్ పై కూడా పెద్ద ఎత్తున ప్రశంసలు కురుస్తున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్ నటులు చాలా మంది అల్లు అర్జున్ నటనకు ఫిదా అయ్యిపోయారు.

ఇక లేటెస్ట్ గా ఈ లిస్ట్ లో అక్కడి సీనియర్ మరియు స్టార్ నటుడు అయినటువంటి అనుపమ్ ఖేర్ రీసెంట్ గా పుష్ప సినిమా చూసి తన సాలిడ్ రెస్పాన్స్ ని వ్యక్త పరచడమే కాకుండా తాను కూడా బన్నీ తో నటించాలని కోరుకుంటున్నానని తన మనసులో మాట తెలిపారు. మరి తాను అనుకున్నది ఎప్పుడు నెరవేరుతుందో చూడాలి. మరి ఇలాంటి సీనియర్ నటుడినే బన్నీ మెప్పించాడు అంటే తన పెర్ఫామెన్స్ ఆయనికి ఎంత నచ్చిందో అర్ధం చేసుకోవచ్చు.

సంబంధిత సమాచారం :