చిరు, పవన్ లతో కలిసి పనిచేయాలనుకుంటున్న స్టార్ హీరో !

Aamir_khan
స్టార్ హీరో హోదాలో ఉన్న ఒక హీరో మరొక హీరోని పొంగడటమే గొప్ప విషయమైతే పలనా హీరోతో కలిసి పనిచేయాలని ఉంది. ఆయన నా అభిమాన హీరో అని చెప్పడం మామూలు విషయం కాదు. కానీ బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ మాత్రం ఈ విషయాన్ని చాలా మామూలుగా, ఎలాంటి మొహమాటం లేకుండా చెప్పేశాడు. బాలీవుడ్ లోనే కాక భారతీయ సినీ పరిశ్రమలో ప్రయోగాలకు, కొత్తదనానికి కేరాఫ్ అడ్రస్ గా చెప్పుకునే ఆయన తాజాగా చేస్తున్న మరో ప్రయోగాత్మక చిత్రం ‘దంగల్’ త్వరలో విడుదల కానుంది.

ట్రైలర్లు బాగుండటంతో తెలుగులో ‘యుద్ధం’ పేరుతో వస్తున్న ఈ బాలీవుడ్ సినిమా పై మంచి అంచనాలున్నాయి. ఈ చిత్ర ప్రమోషన్లో భాగంగా నిర్వహించిన మీడియా సమావేశంలో అమీర్ మాట్లాడుతూ నాకు తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం, వాళ్ళతో కలిసి పనిచేయాలని ఉంది అన్నారు. అలాగే తమిళంలో సూపర్ స్టార్ రజనీకాంత్ అంటే చాలా అభిమానమని ఆయనతో కలిసి సినిమా చేయాలని ఉందని అన్నారు. మహావీర్ సింగ్ ఫోగట్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 23న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.