షాకింగ్ న్యూస్ బయటపెట్టిన బ్రహ్మాజి !
Published on Apr 21, 2017 2:02 pm IST


టాలీవుడ్ ప్రముఖ నటుడు బ్రహ్మాజీ కొద్దీ సేపటి క్రితమే ట్విట్టర్ ద్వారా ఒక షాకింగ్ న్యూస్ బయటపెట్టారు. అది కూడా ఆయన కుటుంబం గురించి కావడంతో ఆ న్యూస్ కాస్త హాట్ టాపిక్ గా మారింది. ట్విట్టర్ ద్వారా బ్రహ్మాజీ తెలుపుతూ ‘నా కుమారుడు సంజయ్, అతని భార్య ఇంద్రాక్షి గత 5 నెలలుగా విడిపోయి ఉన్నారు. వాళ్ళు త్వరలోనే విడాకులు కూడా తీసుకుంటారు’ అన్నారు.

అలాగే వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్లకు అందరు విషెస్ చెప్పండని కూడా అన్నారు. తాజాగా సినీ వర్గాల నుండి తెలుస్తున్న సమాచారం ప్రకారం బ్రహ్మాజీ కుమారుడు త్వరలోనే సినిమాల్లోకి వస్తాడట. అయితే ఈ అంశంపై బ్రహ్మాజీ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

 
Like us on Facebook