బ్రేకింగ్ సర్ప్రైజ్ : తెలుగులో స్ట్రీమింగ్ కి వచ్చేసిన “హను మాన్”

బ్రేకింగ్ సర్ప్రైజ్ : తెలుగులో స్ట్రీమింగ్ కి వచ్చేసిన “హను మాన్”

Published on Mar 17, 2024 11:20 AM IST

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జ హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్ గా దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం “హను మాన్” (Hanu Man Movie). మరి మన తెలుగులో మొదటి సూపర్ హీరో సినిమాగా ఇది రాగా ఈ సినిమా ఓటిటి (Hanu Man OTT Release) రిలీజ్ కోసం అయితే ఫ్యాన్స్ అంతా అత్యంత ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ చిత్రం కోసం ఇంతలా ఎదురు చూస్తుండగా ఫ్యాన్స్ కి మాత్రం మేకర్స్ ఊరిస్తూ డేట్ ని కూడా రివీల్ చేయలేదు.

అయితే నిన్న రాత్రే మొదటగా హిందీ వెర్షన్ రిలీజ్ కి రాగా ఇప్పుడు ఈరోజు 17న ఈ చిత్రం స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ జీ 5 లో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. అయితే ఈ చిత్రం మొట్ట మొదటిగా తెలుగు భాషలోనే ఇప్పుడు హను మాన్ ఇప్పుడు అందుబాటిలోకి వచ్చేసింది. ఇది మాత్రం దీనికోసం వెయిట్ చేస్తున్న వారికి సూపర్ సర్ప్రైజ్ అని చెప్పాలి.

మరి ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న వారు లేట్ చేయకుండా జీ 5 లో సినిమాని చూసి మరో సారి ఎంజాయ్ చేయవచ్చు. ఇక ఈ చిత్రానికి గౌర హరీష్ సంగీతం అందించగా నిరంజన్ రెడ్డి నిర్మాణం వహించారు. అలాగే ఇప్పుడు మేకర్స్ సెన్సేషనల్ సీక్వెల్ “జై హనుమాన్” లో బిజీగా ఉన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు