సూర్య ’24’ సినిమా బడ్జెట్ ఎంతంటే..!

సూర్య ’24’ సినిమా బడ్జెట్ ఎంతంటే..!

Published on May 3, 2016 4:59 PM IST

Suriya-24
సూర్య హీరోగా నటించిన ప్రయోగాత్మక సినిమా ’24’ సినిమా కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో చెప్పాల్సిన పనిలేదు. గత కొద్దికాలంగా భారీ క్రేజ్‌ను మూటగట్టుకున్న ఈ సినిమా అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకొని ఈనెల 6న ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున విడుదలవుతోంది. ఇక సూర్య తన సొంత బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ కూడా వినూత్నంగా సాగుతూ ప్రేక్షకుడికి సినిమాపై మరింత ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇక ఈ ప్రమోషనల్ కార్యక్రమాల్లో భాగంగా సూర్య, ఈ సినిమా బడ్జెట్ వివరాలను ప్రకటించడం విశేషంగా చెప్పుకోవచ్చు.

ఓ సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాను 75 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో నిర్మించినట్లు సూర్య స్వయంగా తెలియజేశారు. ’13బీ’, ‘ఇష్క్’, ‘మనం’ సినిమాలతో ఓ కొత్త ట్రెండ్ సృష్టించిన దర్శకుడు విక్రమ్ కుమార్ నిర్మించిన సినిమా కావడం కూడా 24కు ఈ స్థాయి అంచనాలు ఉండడంలో ఓ కారణంగా చెప్పుకోవచ్చు. సూర్య సరసన సమంత, నిత్యా మీనన్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా సుమారు 2000లకు పైగా థియేటర్లలో విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు