బజ్ : ‘కోటబొమ్మాళి పిఎస్’ ఓటిటి రిలీజ్ డేట్ లాక్ ?

బజ్ : ‘కోటబొమ్మాళి పిఎస్’ ఓటిటి రిలీజ్ డేట్ లాక్ ?

Published on Dec 28, 2023 1:22 AM IST


గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు, విద్య కొప్పినీడి నిర్మాతలుగా శ్రీకాంత్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్, వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ డ్రామా మూవీ కోటబొమ్మాళి పిఎస్. ఈ మూవీని తేజ మర్ని తెరకెక్కించారు. మలయాళ మూవీ నయట్టు కి అఫీషియల్ రీమేక్ గా రూపొందిన ఈ మూవీ ఇటీవల ఆడియన్స్ ముందుకి వచ్చి మంచి సక్సెస్ సొంతం చేసుకుంది.

పొలిటికల్ టచ్ తో కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సర్వైవల్ థ్రిల్లర్ మూవీకి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ లభించింది. విషయం ఏమిటంటే, తాజాగా ఈ మూవీ యొక్క ఓటిటి రిలీజ్ డేట్ లాక్ అయినట్లు తెలుస్తోంది. ప్రముఖ తెలుగు ఓటిటి మాధ్యమం ఆహా వారు ఈ మూవీ యొక్క ఓటిటి రైట్స్ దక్కించుకున్నారు. ఈ మూవీన జనవరి 5న ఆహాలో ప్రసారం కానున్నట్లు బజ్. అయితే దీని పై వారి నుండి అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ మాత్రం రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు