పవన్ ఎపిసోడ్ ప్రసారం ఆ రోజే?

పవన్ ఎపిసోడ్ ప్రసారం ఆ రోజే?

Published on Jan 2, 2023 3:00 PM IST

బాలయ్య బాబు అన్ స్టాపబుల్ సీజన్ 2 కూడా సూపర్ సక్సెస్ అయింది. ఐతే, రాబోయే ఎపిసోడ్స్ లో పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కూడా ఉంది. ఇప్పటికే అన్ స్టాపబుల్ షోలో పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ను షూట్ కూడా చేశారు. ఇక ఈ ఎపిసోడ్ ప్రీమియర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐతే, ఆహా టీమ్ పవన్ ఎపిసోడ్ ని సంక్రాంతి స్పెషల్ కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఇప్పడున్న పుకార్లు నిజమైతే, ఈ గ్రాండ్ ఎపిసోడ్ జనవరి 13న ఆహా ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ లో ప్రసారం కానుంది.

మరి బాలయ్య తన షోకి వచ్చిన పవన్ కళ్యాణ్ ను ఎలాంటి ప్రశ్నలు వేశాడు ? అన్నదే ఇప్పుడు ప్రధాన ఆసక్తి. ఏది ఏమైనా పవన్ – బాలయ్య ఒకే వేదిక పై, పైగా ఇద్దరి మధ్య పర్సనల్ విషయాలు డిస్కషన్ కి రావడం నిజంగా ఫ్యాన్స్ కి ఫుల్ మీల్సే. మొత్తానికి బాలయ్య – పవన్ ఎపిసోడ్ సరికొత్త రికార్డ్స్ ను సృష్టించడం ఖాయం అంటున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు