త్వరలో టీవీ ప్రీమియర్ గా “చంద్రముఖి 2”

త్వరలో టీవీ ప్రీమియర్ గా “చంద్రముఖి 2”

Published on Dec 22, 2023 9:01 PM IST

పి. వాసు దర్శకత్వం లో ప్రముఖ నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ ప్రధాన పాత్రల్లో నటించిన కామెడీ హార్రర్ మూవీ చంద్రముఖి 2. ఈ చిత్రం 2005 లో రిలీజైన చంద్రముఖి చిత్రానికి సీక్వెల్ గా ఆడియెన్స్ ముందుకి వచ్చింది. అయితే ఇది ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. బాక్సాఫీస్ వద్ద పేలవ ప్రదర్శన కనబరిచింది. ఈ చిత్రం ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయిపోయింది.

త్వరలో ప్రముఖ టీవీ ఛానల్ అయిన జెమిని టీవీ లో ఇది వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారం కానుంది. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ నిర్మించిన ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. బుల్లితెర పై ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు