ఐశ్వర్యారాయ్ తో రామ్ చరణ్ సినిమా అంటూ వార్తలు..!
Published on May 27, 2017 5:40 pm IST


రామ్ చరణ్ హీరోగా, ఐశ్వర్యారాయ్ హీరోయిన్ గా మణిరత్నం దర్శకత్వంలో సినిమారబోతుందంటూ సోషల్ మీడియా మొత్తం వార్తలు వ్యాపించాయి. దీనికి సంబదించిన అనేక వార్తలు వస్తూ అభిమానులను కన్ఫ్యూషన్ కు గురిచేస్తున్నాయి.

కాగా మాకు అందుతున్న సమాచారం ప్రకారం రామ్ చరణ్ తో మణిరత్నం సినిమా చేయడానికి చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కానీ అందులో ఐశ్వర్యారాయ్ హీరోయిన్ గా నటిస్తుందనే వార్తలు పూర్తిగా అవాస్తవం. కాగా ఐశ్వర్యారాయ్ కూడా మణిరత్నంతో ఓ సినిమా చేయనుంది. కానీ అది వేరే ప్రాజెక్ట్. రామ్ చరణ్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో నటిస్తూ బిజీగా ఉన్నాడు.

 
Like us on Facebook