మేడ్చల్ లో ఎవడు సినిమా షూటింగ్

Published on Mar 7, 2013 6:10 pm IST

Yevadu-Stills
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘ఎవడు’ సినిమా షూటింగ్ మేడ్చల్లో జరుగుతోంది. ఈ సినిమాలోని కొన్ని కామెడీ సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరిస్తున్నారు. చరణ్ తో కలిసి రఘు కరుమంచి ఈ షూటింగ్లో పాల్గొంటున్నారు. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్ లు కీలకమైన పాత్రలలో కనిపించనున్నారు. మర్డర్ మీస్టరీ గా ఈ సినిమా ఉండవచ్చునని సమాచారం. ఈ సినిమాని ఈ సంవత్సరం సెకండాఫ్ లో విడుదల చేసే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం :