సినిమా కోసం బ్రేక్ తీసుకోనున్న మెగాస్టార్ !


150వ సినిమా ‘ఖైదీ నెం. 150’ తో సక్సెస్ ఫుల్ రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఆ తర్వాత ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షోతో టీవీల్లో కూడా సందడి చేశారు. ఇలా ప్రేక్షకుల్ని వెండి తెర, బుల్లి తెర రెండింటిపైనా అలరించిన అయన తన 151వ సినిమా ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ కి సిద్దమవుతున్నారు. అందుకోసమే ప్రస్తుతం చేస్తున్న మీలో ఎవరు కోటీశ్వరుడు షో కి కూడా మే నెలాఖరు నుండి బ్రేక్ కాస్త బ్రేక్ ఇవ్వనున్నారు.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న ఈ సినిమా ఆగష్టు నెల నుండి మొదలయ్యే అవకాశాలున్నాయి. హిస్టారికల్ డ్రామాగా ఉండనున్న ఈ చిత్రంపై అభిమానుల్లో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలను మించి సినిమా ఉండాలనే ఉద్దేశ్యంతో నిర్మాత రామ్ చరణ్ ప్రాజెక్టుకు భారీ బడ్జెట్ ను కేటాయించండంతో పాటు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో చిరు సరసన హీరోయిన్ గా ఎవరు నటిస్తారనేది ఇంకా ఫైనల్ కాలేదు.