“చోర్ బజార్” నుంచి చోర్‌కియారె వీడియో సాంగ్ రిలీజ్..!

Published on Jun 23, 2022 12:30 am IST

టాలెంటెడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ తనయుడు ఆకాష్‌ పూరి ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘చోర్‌ బజార్‌’. ఈ చిత్రంలో గెహన సిప్పీ కథానాయికగా నటించింది. ‘దళం’, ‘జార్జ్ రెడ్డి’ సినిమాలతో టాలీవుడ్‌లో తనదైన మార్క్‌ను క్రియేట్ చేసుకున్న జీవన్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 24న ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది.

ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రచార చిత్రాలకి, వీడియోలకి, పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా ఈ చిత్రం నుంచి “చోర్‌కియారె” అనే వీడియో సాంగ్ రిలీజ్ అయ్యింది. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతాన్ని అందించగా, ప్రియదర్శన్ బాలసుబ్రహ్మణ్యం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. ఐవీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాత వీఎస్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. అల్లూరి సురేశ్ వర్మ ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరించారు.

సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :