ప్రముఖ సినీ దర్శకుడు కే. వాసు కన్నుమూత!

Published on May 26, 2023 7:32 pm IST

ప్రముఖ సినీ దర్శకుడు కే. వాసు కిమ్స్ లో చికిత్స పొందుతూ కొద్ది సేపటి క్రితం తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా ఆయన కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. ఆయన మృతి తో సినీ పరిశ్రమ కి చెందిన ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

టాలీవుడ్ స్టార్ హీరో, మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన తొలి సినిమా ప్రాణం ఖరీదు చిత్రానికి కే. వాడు దర్శకుడు గా వ్యవహరించారు. రేపు ఉదయం 6 గంటలకు కిమ్స్ హస్పిటల్ నుంచి ఫిల్మ్ నగర్ ఇంటికి ఆయన దేహాన్ని తీసుకురానున్నారు. మధ్యాహ్నం 12 గంటల సమయం లో మహా ప్రస్థానం లో అంత్య క్రియలు జరగనున్నాయి.

సంబంధిత సమాచారం :