‘భాగమతి’లో అనుష్క డ్యూయెల్ రోల్ పై క్లారిటీ వచ్చేసింది !

8th, November 2017 - 12:35:19 PM

లేడీ సూపర్ స్టార్ అనుష్క చేస్తున్న తాజా చిత్రం ‘భాగమతి’ చివరి దశ పనుల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ విడుదలై మంచి స్పందనతో పాటు సినిమాపై బోలెడంత క్రేజ్ ను క్రియేట్ చేసింది. ఇకపోతే ఈ చిత్రంలో అనుష్క ద్విపాత్రాభినయం చేస్తున్నారని కూడా వార్తలొచ్చాయి. తాజగా ఒక ఇంటర్వ్యూలో చిత్ర దర్శకుడు అశోక్ మాట్లాడుతూ ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చారు.

అనుష్క ద్విపాత్రాభినయం ఒట్టి పుకారని, అలాగే సినిమాలో ఎలాంటి ఫాంటసీ అంశాలు ఉండవని, ఒకే జానర్లో నడుస్తుందని, కానీ స్క్రీన్ ప్లే కొత్తగా, థ్రిల్లింగ్ అంశాలాటి నిండి ఉంటుందని అన్నారు. అంతేగాక ఈ కథను అనుష్కకు 2012లో చెప్పానని, కానీ ఆమెకు ‘బాహుబలి, లింగ, బాహుబలి-2, సైజ్ జీరో’ వంటి ప్రాజెక్ట్స్ ఉండటం వలన ఆలస్యమైందని, కానీ అనుష్క చెప్పిన ప్రకారమే సినిమా చేశారని చెప్పుకొచ్చారు.

యువీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. మది సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతాన్ని సమాకూరుస్తున్నారు.